![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -312 లో.. అనామిక, రుద్రాణి కలిసి ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి రాహుల్, కళ్యాణ్ లకి ఆఫీస్ బాధ్యతలు అప్పగించేలా చెయ్యాలని అనుకుంటారు. రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి.. నువ్వు నీ కొడుకు గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కళ్యాణ్ కి పెళ్లి అయింది. కళ్యాణ్ ఇంటిదగ్గర ఖాళీగా కూర్చొని ఉంటే అనామిక ఏం అనుకుంటుంది. కళ్యాణ్ ఆఫీస్ కి వెళ్తే బాగుంటుంది కదా అంటూ ధాన్యలక్ష్మి లో ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత థాంక్స్ అంటీ నాకు చాల హెల్ప్ చేస్తున్నారని అనామిక అనగానే.. నీకు హెల్ప్ కాదు రాహుల్ ని కూడా సెట్ చెయ్యొచ్చని నా ప్లాన్ అని రుద్రాణి తన మనసులో అనుకుంటుంది.
ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే.. శ్వేత ఫోన్ చేసి హెల్ప్ మీ అని అంటుంది. దాంతో రాజ్ కంగారుగా వెళ్తుంటే కావ్య కాఫీ తీసుకొని వస్తుంది. అయినా తను పట్టించుకోకుండా వెళ్తాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి ఇంటికి ఒకతను వచ్చి.. మేం ఇచ్చిన ఆర్డర్ ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. మీ వల్ల కాదని ముందే చెప్పాలి కదా అంటూ కోపంగా మాట్లాడుతాడు. మీకు టైమ్ వరకు పూర్తి చేస్తానని అతనికి కృష్ణమూర్తి సర్ది చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత రాజ్ ఎవరో అమ్మాయితో ఉన్నాడన్న విషయం కావ్య ఆలోచిస్తు ఉంటుంది. దాంతో కళ్ళు తిరిగి పడిపోతుండగా.. స్వప్న పట్టుకొని ఏమైందని అడుగుతుంది. ఎప్పుడు తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటావని ఇందిరాదేవి అంటుంది. హాస్పిటల్ కీ వెళ్లడం మంచిదని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాజ్ కి కావ్య ఫోన్ చేసి విషయం చెప్పాలి అనేలోపే రాజ్ శ్వేత దగ్గర సిచువేషన్ చూసి కావ్య ఫై చిరాకు పడుతు.. ఫోన్ పెట్టెయ్ అంటాడు. దాంతో స్వప్న నేను ఉన్నాను కదా వెళదామంటు కావ్యని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తుంది. ఆ తర్వాత గాయాలతో ఉన్న శ్వేతని రాజ్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఏంటి డల్ గా ఉన్నావ్? రాజ్ నువ్వు హ్యాపీగా లేరా అని స్వప్న అడుగుతుంది. అదేం లేదు మేం బాగున్నామని కావ్య చెప్తుంది.
కావ్యని డాక్టర్ చెక్ చేసి రిపోర్ట్స్ వచ్చాక టాబ్లెట్స్ రాస్తానని చెప్తుంది. కావ్య స్వప్న లు బయటకు వస్తుంటే.. శ్వేతని ఎత్తుకొని రాజ్ హాస్పిటల్ కీ తీసుకొని వస్తాడు. కావ్య చూసి షాక్ అవుతుంది.. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కావ్య వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత శ్వేతకి ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్.. ఇతను ఏమవుతాడని శ్వేతని అడుగగా.. నా ఫియాన్సీ అని చెప్తుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత అలా చెప్పకుంటే పోలీస్ కేసు అంటారు. అందుకే అలా చెప్పానని శ్వేతా అంటుంది. బయట ఇద్దరు సిస్టర్స్ రాజ్ ,శ్వేతల గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళిద్దరు కాబోయే భార్యాభర్తలంట ఎంత బాగా చూసుకుంటూన్నాడో అని మాట్లాడుకుంటుండగా.. కావ్య విని ఏడుస్తుంటుంది. తరువాయి భాగంలో కావ్య కాకుండా అనామిక భోజనం వడ్డిస్తుంది. కావ్య ఎక్కడ అని రాజ్ అడుగుతాడు. కావ్యకి బాగోలేదని ఇందిరాదేవి చెప్పగానే.. నాకు ఆకలిగా లేదు అంటు కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. రాజ్ వెళ్లేసరికి కావ్య ఏడుస్తు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |